ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్రమణలపై చర్యలు

ABN, First Publish Date - 2021-03-24T05:35:01+05:30

ప్రభుత్వ భూముల ఆక్రమణపై అధికారులు చర్యలు తీసుకున్నారు.

చోడిపల్లిపేటలో ఆక్రమణ స్థలాన్ని పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోగాపురం, మార్చి 23: ప్రభుత్వ భూముల ఆక్రమణపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ముక్కాం పంచాయతీ చోడిపల్లిపేట చంపావతి నది సమీపంలోని 36వ సర్వే నెంబరులో సుమారు ఐదెకరాల జిరాయతీ భూమి ఉంది. దానిని ఆనుకొ ని 37, 38 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఆ భూ యజమానులు జిరాయతీ భూమిని చదును చేస్తూ సర్వే నెంబరు 37, 38లలో సుమారు 4 ఎకరాల ప్రభుత్వ భూమిలోని చెట్లను తొలగించి, చదునుచేసి ఆక్రమణకు పాల్పడ్డారు. విష యం తెలుసుకొన్న ఆర్‌ఐ రవికిరణ్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది మంగళవారం ఆ స్థలానికి చేరుకొని, ఇది ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై ఆర్‌ఐ మాట్లాడుతూ సర్వే నెం.37, 38లోని నాలు గు ఎకరాల ప్రభుత్వ భూమి ని  చదును చేసేశారని, దీనిని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. 

 పూసపాటిరేగ: మండలంలోని గోవిందపురం, కందివలస పంచాయతీలకు ఆనుకొని ఉన్న గెడ్డకు సంబంధించిన భూమిని కొందరు ఆక్రమించుకొనేందుకు ప్రయత్నించటంతో రెవెన్యూ అధికారులు మంగళవారం వెళ్లి ఆ పనులను నిలిపివేశారు. సర్వే నెంబరు 77లో ఈ గెడ్డ ఉండటంతో కొందరు దీనిని ఆక్రమణకు పాల్పడ్డారు. యంత్రాలను తీసుకొనివచ్చి భూమిని చదును చేస్తుండటంతో విషయం తెలుసుకొన్న తహసీల్దార్‌ విజయ్‌భాస్కర్‌ ఆ స్థలాన్ని పరిశీలించాలని ఆదేశించారు. దీంతో ఆర్‌ఐ సత్తిబాబు, రెండు గ్రామాలకు చెందిన వీఆర్వోలు అక్కడకు వెళ్లి పరిశీలించారు. అయితే అది గెడ్డగా గుర్తించటంతో వెంటనే రెవెన్యూ అధికారులు పనులను నిలిపివేయించారు. 

 

Updated Date - 2021-03-24T05:35:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising