ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రికార్డులు సరిగా లేకుంటే చర్యలు

ABN, First Publish Date - 2021-06-14T05:07:42+05:30

మద్యం దుకాణాల్లో రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ బేవరేజ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వీఆర్‌ఎస్‌ కృష్ణ హెచ్చరించారు. భోగాపురంలోని ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మద్యం దుకాణాలను తనిఖీ చేస్తున్న ఏపీబీసీఎల్‌ డీజేఎం కృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ బీసీఎల్‌ డీజేఎం కృష్ణ

భోగాపురం, జూన్‌13: మద్యం దుకాణాల్లో రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ సక్రమంగా నిర్వహించకుంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ బేవరేజ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వీఆర్‌ఎస్‌ కృష్ణ హెచ్చరించారు. భోగాపురంలోని ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కంప్యూటర్‌లో ఉన్న వివరాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం షాపులు తెరవాలని, సమయ పాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు వచ్చిన నగదును చలానాల ద్వారా ప్రభుత్వానికి చెల్లించాలని, పెండింగ్‌ ఉంచొద్దుని, ఎటువంటి అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని అన్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం షాపులను సాధారణ తనిఖీలో భాగంగానే వచ్చామని, ఎటువంటి ఫిర్యాదులు లేవని చెప్పారు. మద్యం షాపులపై ఎటువంటి అసంతృప్తి ఉన్నా.. అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానం వచ్చినా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు.  ఆయన వెంట జిల్లా డిపో స్టోర్స్‌ అధికారి వెంకటరావు, సిబ్బంది కేవీ సన్యాసిరావు తదితరులు ఉన్నారు. 



Updated Date - 2021-06-14T05:07:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising