ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vizag Steel Plant ప్రైవేటీకరణపై మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం

ABN, First Publish Date - 2021-07-20T22:38:58+05:30

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. 100% ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది. 100% ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పింది. ప్రైవేటీకరణపై రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్న లేవనెత్తగా కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్‌ జవాబిచ్చారు. 


కాగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నందున ప్రైవేటీకరిస్తున్నామని ఇప్పటికే కేంద్రనేతలు ప్రకటనలు చేశారు. దీంతో ఏపీలో నిరసనలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో అన్ని పార్టీ నేతలు పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. అటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా ఈ ధర్నాల్లో పాల్గొంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ధర్నాలు కూడా నిర్వహించింది. తాజాగా టీడీపీ ఎంపీ కనమేడల విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ప్రస్తావించారు.  


Updated Date - 2021-07-20T22:38:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising