ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్య కేసు: సీబీఐ విచారణలో కీలక ముందడుగు

ABN, First Publish Date - 2021-07-26T20:17:45+05:30

వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొలిక్కి వచ్చిందన్న వార్తల నేపథ్యంలో డొంక కదులుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో తీవ్ర కలకలం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొలిక్కి వచ్చిందన్న వార్తల నేపథ్యంలో డొంక కదులుతోంది. ఇప్పటి వరకు వివేకా హంతకులు ఎవరు? వారి వెనుక ఎవరున్నారనే అంశాలపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో వివేక ఇంటి వాచ్ మెన్ రంగన్నను సీబీఐ జమ్మలమడుగు కోర్టులో హాజరుపర్చడంతో ఈ మొత్తం వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది.


వాచ్ మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం సంచలనాన్ని రేకెత్తించింది. సుపారీ ఇచ్చి వివేకను హత్య చేయించారని, 9 మంది ప్రమేయం ఉన్నట్లు రంగన్న మేజిస్ట్రేట్ ముందు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులకు రంగన్న ఇచ్చిన వాంగ్మూలం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు వివేక హత్య కేసులో సుమారు 50 రోజులుగా కొనసాగుతున్న సీబీఐ అధికారుల విచారణలో ఎట్టకేలకు కీలక ముందడుగుపడినట్లయింది. పులివెందులకు చెందిన రంగయ్య వైఎస్ వివేక హత్య కేసులో కీలక సాక్షిగా మారాడు.

Updated Date - 2021-07-26T20:17:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising