ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా హత్యకేసులో కీలక మలుపు

ABN, First Publish Date - 2021-08-18T23:25:38+05:30

మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక మలుపు తిరుగుతోంది. అనుమానితుడు సునీల్ యాదవ్‌కు నార్కో అనాలసిస్ పరీక్షల అనుమతి కోరుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యకేసు కీలక మలుపు తిరుగుతోంది. అనుమానితుడు సునీల్ యాదవ్‌కు నార్కో అనాలసిస్ పరీక్షల అనుమతి కోరుతూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. పులివెందుల కోర్టు మేజిస్ట్రేట్ సెలవుపై వెళ్లడంతో జమ్మలమడుగు కోర్టులో వాదనలు జరిగాయి. సునీల్ తరపు న్యాయవాది హితేష్ కుమార్, సీబీఐ అధికారులు హాజరైనారు. కేసు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా సునీల్ ఉన్నాడు. కేసు విచారణ అనంతరం సునీల్‌కు కడప సెంట్రల్ జైలుకు తరలించారు.


ఈ కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి, వైసీపీ పులివెందుల ఇన్‌చార్జి వైఎస్‌ భాస్కరరెడ్డిని సీబీఐ మరోసారి విచారించింది. భాస్కర్‌రెడ్డి సోదరుడు వైఎస్ మనోహర్‌రెడ్డిని కూడా మరోసారి సీబిఐ బృందం విచారిస్తోంది. భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డిలను సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలో కడపలో సీబీఐ అధికారులను వివేకా కుమార్తె సునీత కలిశారు. 


Updated Date - 2021-08-18T23:25:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising