ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-05-12T05:11:12+05:30

ప్రేమ విఫలం కావడంతో ఓ యువతి తీవ్ర మనస్థాపానికి గురై తాను ఉంటున్న హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌ హుక్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది

గొర్లె రమ(ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాజువాక, మే 11: ప్రేమ విఫలం కావడంతో ఓ యువతి తీవ్ర మనస్థాపానికి గురై తాను ఉంటున్న హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌ హుక్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు సంబంధించి గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి....విజయనగరం జిల్లా బొబ్బిలి దరి అలజంగి గ్రామానికి చెందిన గొర్లె రమ అలియాస్‌ శృతి(22) గాజువాకలో ఓ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేట్‌గా పీజీ చేస్తున్నది. అయితే బొబ్బిలి ప్రాంతానికి చెందిన మురళీకృష్ణ అనే యువకుడితో గత ఏడాదిగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నది. ఈ విషయం రమ ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు పెళ్లి చేసేందుకు అంగీకరించారు. కాగా మురళీకృష్ణ విశాఖలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఇదిలావుండగా రమ వేరే యువకుడితో సన్నిహితంగా ఉంటున్నట్టు అనుమానించి మురళీకృష్ణ పెళ్లికి నిరాకరించాడు. అంతేకాకుండా ఆమెను పరుష పదజాలంతో మాట్లాడటంతో మనస్థాపానికి గురైంది. ఈ విషయాన్ని సోమవారం రాత్రి రమ తన తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది. మంగళవారం ఉదయం రమ తలుపు తీయకపోవడంతో అనుమానించిన హాస్టల్‌ వార్డెన్‌ పోలీసులకు సమాచారం అందించాడు. తలుపులు బలవంతంగా తెరిచి చూడగా రమ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. బొబ్బిలిలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. 


Updated Date - 2021-05-12T05:11:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising