ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా ముగిసిన వారోత్సవాలు

ABN, First Publish Date - 2021-08-04T06:12:39+05:30

ఆంధ్రా,ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు తలపెట్టిన వారోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు, కటాఫ్‌ ఏరియా గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆంధ్రా,ఒడిశా సరిహద్దులో కూంబింగ్‌కు వెళ్లి తిరిగి వస్తున్న పోలీసు బలగాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఊపిరి పీల్చుకున్న పోలీసులు, గిరిజనులు

సీలేరు, ఆగస్టు 3: ఆంధ్రా,ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు తలపెట్టిన వారోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు, కటాఫ్‌ ఏరియా గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు.  జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టులు ఏవోబీలో అమరవీరుల వారోత్సవాలకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో రెండు రాష్ర్టాల పోలీసులు వారోత్సవాలకు పది రోజుల ముందు నుంచే ఏవోబీని జల్లెడ పట్టారు. జూలై 20న జీకేవీధి మండలం పెబ్బంపల్లి వద్ద మరోసారి పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు తప్పించుకున్నారు. ఏవోబీలో మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు పక్కా సమాచారం పోలీసుల నిఘా వర్గాలకు అందుతున్నది. ఈ నేపథ్యంలో అమరవీరుల వారోత్సవాలను మావోయిస్టులు జరుపుకోలేని పరిస్థితి ఎదురైంది. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా చెప్పుకునే ఒడిశాలో కూడా ఎక్కడ పడితే అక్కడ అవుట్‌ పోస్టులను ఏర్పాటు చేసి, నిత్యం కూంబింగ్‌ నిర్వహిస్తుండడంతో మావోయిస్టుల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఏవోబీలో ఎటువంటి సంఘటనలు జరగపోవడంతో ఇరు రాష్ర్టాల పోలీసులు, సరిహద్దు ప్రాంతాల గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు.


 

Updated Date - 2021-08-04T06:12:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising