ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటక్‌ కృషితోనే ఉక్కు కార్మికులకు వేతన సవరణ

ABN, First Publish Date - 2021-10-29T04:25:04+05:30

ఇంటక్‌ కృషితోనే ఉక్కు కార్మికులకు వేతన సవరణ జరిగిందని స్టీల్‌ ఇంటక్‌ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్‌ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ సెంట్రల్‌ స్టోర్స్‌ జంక్షన్‌ వద్ద గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి రాజశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంఘం ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్‌ 


ఉక్కుటౌన్‌షిప్‌, అక్టోబరు 28: ఇంటక్‌  కృషితోనే ఉక్కు కార్మికులకు వేతన సవరణ జరిగిందని స్టీల్‌ ఇంటక్‌ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్‌ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ సెంట్రల్‌ స్టోర్స్‌ జంక్షన్‌ వద్ద గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌జేసీఎస్‌ సమావేశంలో రెండు యూనియన్లు ఉక్కు కార్మికులకు వేతన సవరణ ఒప్పంద ఎంవోయూ జరగకుండా కుటిల ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంటక్‌ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి పట్దుదలతో యాజమాన్యంపై చేసిన ఒత్తిడి కారణంగా ఎంవోయూ జరిగిందన్నారు. అనేకసార్లు వేతన సవరణపై సమావేశాలు జరిగినప్పటికీ కీలక నిర్ణయం తీసుకోకపోవడంతో కార్మికవర్గం ఆర్థికంగా నష్టపోయిందన్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి పూర్తయినప్పటికీ  యాజమాన్యం అండతో  కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో గంధం వెంకటరావు, బి.మురళీరాజు, నీరుకొండ రామచంద్రరావు, ఎండీ రఫీ, గంట్యాడ పైడిరాజు, ఎంఎన్‌.రెడ్డి, కొవిరి అవతారం, పీవీ నగేష్‌, పీవీ రమణమూర్తి, ఆర్‌.జగదీష్‌కుమార్‌, డి.సాహూ, గంగవరం గోపి, ఎస్‌.నరసింగరావు, జెర్రిపోతుల మోహన్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T04:25:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising