ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసుల అతి ప్రవర్తన కట్టడి చేయండి

ABN, First Publish Date - 2021-03-02T06:33:11+05:30

ఎన్నికల ప్రచారంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కు తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఫిర్యాదు చేశారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ ఎమ్మెల్సీ ఫిర్యాదు

విశాఖపట్నం, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కు తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు ఫిర్యాదు చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించిన అనంతరం కమిషనర్‌కు పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ ఐదుగురితో వార్డుల్లో ప్రచారం చేస్తే అభ్యంతరం తెలుపుతున్న పోలీసులు, వైసీపీ నాయకుల విషయానికి వచ్చేసరికి భారీ ఊరేగింపునకు బందోబస్తు ఇవ్వడం దారుణమన్నారు. ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలకు ఒకే నిబంధన ఉండాలని పేర్కొన్నారు. మునిసిపల్‌, జీవీఎంసీ ఎన్నికలలో పోలింగ్‌ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో వీడియో కెమెరాలు, జనరేటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. అనకాపల్లి పఽరిధి 80వ వార్డులో 1600 ఓట్ల గల్లంతుపై విచారణ చేయాలని కోరారు. 



Updated Date - 2021-03-02T06:33:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising