ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమర శంఖరావ సభను విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2021-04-13T06:10:24+05:30

ఈ నెల 18న తలపెట్టిన రైతు, కార్మిక సమర శంఖరావ సభను విజయవంతం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది.

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు

ఉక్కుటౌన్‌షిప్‌, ఏప్రిల్‌ 12: ఈ నెల 18న తలపెట్టిన రైతు, కార్మిక సమర శంఖరావ సభను విజయవంతం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చింది. స్టీల్‌ప్లాంట్‌ ఎల్‌ఎంఎంఎం పార్కులో సోమవారం జరిగిన సమావేశంలో పోరాట కమిటీ ఛైర్మన్‌లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. రైతాంగ చట్టాలు అమలుకు నిరసనగా రైతులు చేస్తున్న పోరాటమే మన పోరాటానికి స్ఫూర్తిదాయకమన్నారు. బీచ్‌ రోడ్డు వద్ద జరిగే సభకు భారీ ఎత్తున కార్మికవర్గం హాజరుకావాలని కోరారు. కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్‌లకు అప్పగించడం దేశ ద్రోహమన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ భక్తి అనే ముసుగులో రైతులపై, కార్మికులపై దాడులు చేస్తున్నదన్నారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గంధం వెంకటరావు, కెఎస్‌ఎన్‌.రావు, వై.టి.దాసు,  వై.మస్తానప్ప, దొమ్మేటి అప్పారావు, వరసాల శ్రీనివాస్‌, సింహాచలం, సన్యాసిరావు, బొడ్డు పైడిరాజు, జి.గణపతిరెడ్డి, జీఆర్‌కె.నాయుడు, అప్పలరాజు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-13T06:10:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising