ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ లేకుండా రోడ్డుపైకి వస్తే చర్యలు

ABN, First Publish Date - 2021-04-11T06:17:41+05:30

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉదృతి నేపథ్యంలో మాస్క్‌ లేకుండా రోడ్డుపైకి వచ్చేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా అన్నారు.

తెన్నేటి పార్కులో మాస్క్‌లు ధరించనివారికి అవగాహన కల్పిస్తున్న సీపీ మనీష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా

విశాఖపట్నం, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ ఉదృతి నేపథ్యంలో మాస్క్‌ లేకుండా రోడ్డుపైకి వచ్చేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా అన్నారు. మాస్క్‌ ధారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన శనివారం ఆర్కే బీచ్‌, తెన్నేటి పార్కు వంటి ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్క్‌ లేకుండా రోడ్డుడపై కనిపించేవారిని తాము రెండు రకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాదచారులు మాస్క్‌ లేకుండా కనిపిస్తే వారికి ఉచితంగా మాస్క్‌ అందజేసి, మాస్క్‌ దరించడం వల్ల  కలిగే ప్రయోజనాలను వివరించి అవగాహన పెంచుతున్నామన్నారు. వాహనచోదకులు ఎవరైనా మాస్క్‌ లేకుండా బయటకు వస్తే వారికి ఈ-చలాన్‌ ద్వారా జరిమానాలు విధిస్తున్నామన్నారు. గత నెల 27న ప్రారంభించిన నో మాస్క్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో శుక్రవారం నాటికి 50,037 మందికి రూ.120 చొప్పున జరిమానాలు విధించామన్నారు. భవిష్యత్తులో కూడా శాంతిభద్రతలు, క్రైమ్‌, ట్రాఫిక్‌, ఏఆర్‌ విభాగాలతో దీనిని కొనసాగిస్తామని సీపీ తెలిపారు.


Updated Date - 2021-04-11T06:17:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising