ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ డేవిడ్‌, పవన్‌ జంట

ABN, First Publish Date - 2021-03-01T06:35:47+05:30

ఏవీఎన్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ నిర్వహించిన నాన్‌ మెడలిస్ట్‌ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ టోర్నీలో డేవిడ్‌, పవన్‌ జంట చాంపియన్‌గా నిలిచింది.

టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం(స్పోర్ట్సు), ఫిబ్రవరి 28: ఏవీఎన్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ నిర్వహించిన నాన్‌ మెడలిస్ట్‌ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ టోర్నీలో డేవిడ్‌, పవన్‌ జంట చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ఏవీఎన్‌ కాలేజీ ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ హాల్లో జరిగిన ఫైనల్స్‌లో  డేవిడ్‌-పవన్‌ జంట 14-21, 21-18, 21-15 స్కోరుతో ఎం.ప్రేమ్‌కుమార్‌-ఎ.అభి జంటపై విజయం సాధించి చాంపియన్‌ ట్రోఫీతోపాటు రూ.15 వేలు నగదు బహుమతిని కైవసం చేసుకున్నారు. రన్నరప్‌గా నిలిచిన ఎం.ప్రేమ్‌కుమార్‌-ఏ.అభి జంట రూ.పది వేలు, మూడు నాలుగు స్థానాలను దక్కించుకున్నవారికి చెరో రూ.ఐదు వేలు, క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓడిన వారికి తలో రూ.మూడు వేలు చొప్పున నగదు బహుతులు అందుకున్నారు. టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఏసీపీ  కాళిదాసు ముఖ్య అతిఽథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బుల్లయ్య కాలేజి సీనియర్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.పోలిరెడ్డి, అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు లింగేశ్వరరావు, నాయక్‌, ఉదయ్‌భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-01T06:35:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising