ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రీన్‌బెల్ట్‌కు వీఎంఆర్డీఏ మంగళం

ABN, First Publish Date - 2021-11-26T06:34:47+05:30

నగరవాసులకు తాగునీరందిస్తున్న మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ పరివాహక ప్రాంతంలో హరిత వనం(గ్రీన్‌బెల్ట్‌)పెంపకానికి కేటాయించిన భూములకు వీఎంఆర్డీఏ మంగళం పాడేసింది.

పెదగాడి, రాంపురం, పినగాడి గ్రామాల మధ్య ఉన్న గ్రీన్‌బెల్ట్‌ భూములు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ పరివాహక ప్రాంతంలో హరిత వనం తొలగింపునకు రంగం సిద్ధం

మంచినీటి పరిరక్షణ దృష్ట్యా మినహాయింపు సరికాదని నిపుణుల అభిప్రాయం


పెందుర్తి రూరల్‌, నవంబరు 25: నగరవాసులకు తాగునీరందిస్తున్న మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ పరివాహక ప్రాంతంలో హరిత వనం(గ్రీన్‌బెల్ట్‌)పెంపకానికి కేటాయించిన భూములకు వీఎంఆర్డీఏ మంగళం పాడేసింది. గ్రీన్‌బెల్ట్‌ కోసం కేటాయించిన భూములలో దాదాపు 90 శాతం భూములను ఆ పరిధి నుంచి మినహాయించినట్టు విశ్వసనీయ సమాచారం. రిజర్వాయర్‌ గర్భానికి కేవలం 30 మీటర్ల దూరం వరకు భూములను మాత్రమే గ్రీన్‌బెల్ట్‌ పరిధిలో ఉంచారు. మిగతా భూములకు మినహాయింపు ఇవ్వడంతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, రిజర్వాయర్‌లో మంచినీటి పరిరక్షణ దృష్యా మినహాయింపు సరికాదని నిపుణులు ఆక్షేపిస్తున్నారు.

2 వేల ఎకరాలకు పైనే..

1975లో మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ ఏర్పడినప్పుడు రిజర్వాయర్‌ నీరు కలుషితం కాకుండా నివారించే చర్యలలో భాగంగా రిజర్వాయర్‌ పరివాహక ప్రాంతంలో గల పెదగాడి, పినగాడి, రాంపురం, చింతగట్ల, జెర్రిపోతులపాలెం, నరవ ప్రాంతాలలో సుమారు మూడు వేల ఎకరాలు రైతులకు చెందిన జిరాయితీ  భూములను గ్రీన్‌బెల్ట్‌కు ప్రభుత్వం కేటాయించింది. దీని పట్ల స్థానిక రైతులు అసంతృప్తి చెందినా అప్పట్లో భూములకు పెద్దగా ధరలు, గిరాకీ లేకపోవడంతో వారు పెద్దగా స్పందించలేదు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలోని భూముల ధరలు పెరగడం, నివాసిత ప్రాంతంగా గుర్తింపు రావడంతో భూముల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలోనే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో స్థానిక భూముల ధరలు అమాంతం పెరిగాయి. కాగా గ్రీన్‌బెల్ట్‌ పరిధిలో లేని పలు భూములను ఆ పరిధిలోకి తెచ్చి, గ్రీన్‌బెల్ట్‌ పరిధిలో ఉన్న భూములను ఆ పరిధి నుంచి తొలగిస్తూ వీఎంఆర్డీఏ ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానిక రైతులు ఆందోళనకు గురయ్యారు. తమ భూములను గ్రీన్‌బెల్ట్‌ నుంచి మినహాయించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజుపై ఒత్తిడి తీసుకొచ్చారు. అంతే కాకుండా పెదగాడి, పినగాడి, రాంపురం, చింతగట్ల, జెర్రిపోతులపాలెం పంచాయతీల పాలకవర్గాలు గ్రీన్‌బెల్ట్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి వీఎంఆర్డీఏకు పంపించారు. ఈ తీర్మానంలో గతంలో వచ్చిన కొన్ని కోర్టు ఉత్తర్వులను జత చేశారు. రిజర్వాయర్‌ నిర్మాణానికి 10 లేక 20 మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాన్నే గ్రీన్‌బెల్ట్‌ ప్రాంతంలో ఉంచాలని, ఒకవేళ మొత్తం భూమిని గ్రీన్‌బెల్ట్‌ పరిధిలో  ఉంచాలనుకుంటే ఆ భూములకు సంబంధించిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని జారీ అయిన కోర్టు ఉత్తర్వుల కాపీలను వీఎంఆర్డీఏకు సమర్పించారు. రైతుల డిమాండ్‌తో వీఎంఆర్డీఏ వెనక్కి తగ్గింది. దీంతో గతంలో గ్రీన్‌బెల్ట్‌కు కేటాయించిన భూములను కూడా ఆ పరిధి నుంచి తప్పించేసింది. గ్రీన్‌బెల్ట్‌కు కేటాయించిన పెదగాడి, పినగాడి, రాంపురం, చింతగట్ల, జెర్రిపోతులపాలెం పంచాయతీల గ్రామాలకు చెందిన సుమారు రెండు వేల ఎకరాల మేర భూములను గ్రీన్‌బెల్ట్‌ నుంచి మినహాయించడానికి రంగం సిద్ధం చేసింది. అయితే దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. 


Updated Date - 2021-11-26T06:34:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising