ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండున్నరేళ్లుగా విశాఖను దోచుకుంటున్నారు

ABN, First Publish Date - 2021-10-27T06:36:51+05:30

విశాఖ నగరంలో దొంగలు పడి రెండున్నర సంవత్సరాలుగా దోచుకుంటున్నారని మాజీ మంత్రి సీహెచ్‌.అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.

మాట్లాడుతున్న అయ్యన్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 విలువైన స్థలం కనిపిస్తే విజయసాయిరెడ్డి బృందం బెదిరింపులు

 అనుమతులు లేకుండా రుషికొండలో నిర్మాణాలు

 కశింకోటలో వందల ఎకరాల భూమి ఆక్రమణ : మాజీ మంత్రి అయ్యన్న 

నర్సీపట్నం, అక్టోబరు 26 : విశాఖ నగరంలో దొంగలు పడి రెండున్నర సంవత్సరాలుగా దోచుకుంటున్నారని మాజీ మంత్రి సీహెచ్‌.అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. స్థానిక విలేఖరులకు మంగళవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.  నగరంలో విలువైన స్థలం కనిపిస్తే విజయసాయిరెడ్డి బృందం బెదిరించి స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో విలువైన హోటల్‌ని నేలమట్టం చేసి, ఆ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా కొత్తగా నిర్మాణాలకు తెగబడుతున్నారని విమర్శించారు. ఈ విషయం అధికారులకు తెలిసినా నోరు మెదపడం లేదని పేర్కొన్నారు. కశింకోటలో వందల ఎకరాల భూమిని ఆక్రమించి అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టి రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కింద స్థాయి అధికారులను బలి చేయడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని అయ్యన్న కోరారు.

Updated Date - 2021-10-27T06:36:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising