ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ చైర్మన్‌ నిర్ణయాలపై శ్రీనివాసానంద సరస్వతీ స్వామి ఆగ్రహం

ABN, First Publish Date - 2021-12-20T19:10:29+05:30

టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డినూ ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డినూ ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.  చైర్మన్ సుబ్బారెడ్డి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారని..ఎవర్ని అడిగి టికెట్ల పెంచుతున్నారని ప్రశ్నించారు. స్వామి దర్శనం కోసం టికెట్స్ ధర కోటి, కోటిన్నర  రూపాయల ధర నిర్ణయించడం ఏమిటని నిలదీశారు. డబ్బులు ఉన్నవారికే.. వెంకటేశ్వరస్వామి దర్శనాలా... వెంకటేశ్వర స్వామిని కూడా  ధనవంతులకు తాకట్టు పెట్టేస్తారేమో? అంటూ మండిపడ్డారు. భక్తులకు దేవుడ్ని దూరం చేయడమే టీటీడీ బోర్డు అనాలోచిత నిర్ణయమని అన్నారు. దేవుడితో టీటీడీ బోర్డు వ్యాపారాలు చేయడం దారుణమన్నారు. టీటీడీ జంబో బోర్డు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని గతంలో చెప్పామని ఇప్పుడు అదే జరుగుతోందని తెలిపారు. అనాలోచిత నిర్ణయాలు వెనక్కి తీసుకోక పోతే టీటీడీ పరిపాలన భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. వెంకటేశ్వర స్వామి సేవలో సుబ్బారెడ్డి ఉంటే...ఆయన సతీమణి బైబిల్ పట్టుకుంటారన్నారు. టీటీడీ తప్పుడు నిర్ణయాలు వెనక్కి తీసుకోక పోతే హిందూ సమాజం తిరగబడతుందని అన్నారు. జగన్ క్రైస్తవ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యలు చేశారు. తిరుమలకు దరిద్రగొట్టు వాళ్ళు రావడంతో... వెంకటేశ్వర స్వామి భారీ వర్షాలతో సంప్రోక్షణ చేసుకున్నారని శ్రీనివాసానంద సరస్వతి స్వామి విమర్శలు గుప్పించారు. 


Updated Date - 2021-12-20T19:10:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising