ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో కొనసాగుతున్న స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక దీక్షలు

ABN, First Publish Date - 2021-07-11T18:38:28+05:30

విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక దీక్షలు కొనసాగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక దీక్షలు కొనసాగుతున్నాయి. శాసన మండలి ప్రొటెం  చైర్మన్ వి బాలసుబ్రహ్మణ్యం, ఐ వెంకటేశ్వరరావు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. ఎంతో మంది ప్రాణాల ఫలితంగా వచ్చిన స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఈ ఉద్యమానికి తెలుగు ప్రజలందరి మద్దతు ఉందని తెలిపారు. ఎంత కష్టం వచ్చిన తమ ప్లాంట్‌ను వదులుకోడానికి తాము సిద్ధంగా లేమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ని విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పరిశ్రమల వల్లే విశాఖకి రాజధాని వస్తుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం తమ పోరాటం ఎక్కడ వరకు అయిన తీసుకువెళ్తామని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రానికే స్టీల్ ప్లాంట్ ఒక్క ఆయువు లాంటిదని వి.బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. 

Updated Date - 2021-07-11T18:38:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising