ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్ ప్లాంట్ రిలే నిరాహార దీక్ష ఎంపీ సత్యనారాయణ సంఘీభావం

ABN, First Publish Date - 2021-07-14T16:18:17+05:30

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 153వ రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 153వ రోజుకు చేరుకుంది. ఈరోజు దీక్షలో విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీలుఫ్లాంట్‌పై అసెంబ్లిలో తీర్మానం జరిగిందని, ఎంపీలందరూ కలిపి త్వరలో నిర్ణయం తీసుకొని  ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కరోనా సమయంలో కూడా ఎండనకా వాననకా దీక్ష చేస్తున్న కార్మికులందరికీ సంఘీభావం తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు ప్రధాని మంత్రికి లేఖలు రాశారని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం కాకుండా,   ప్రభుత్వ రంగ సంస్థలను ఉంచాలని,  స్టీల్ ప్లాంట్‌కు సొంత నిధులు కేటాయించాలని తాము కోరుతున్నట్లు ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-14T16:18:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising