ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏజెన్సీని తలపిస్తున్న గ్రామాలు

ABN, First Publish Date - 2021-03-01T05:58:45+05:30

వేసవి ప్రారంభమైనా మంచు తీవ్రత వీడడం లేదు. దీంతో రహదారులపై ప్రయాణం ప్రమాదాలను ఆహ్వానిస్తోంది. ఉదయం 9 గంటల వరకు మంచు ప్రభావం ఉండడం తో వాహన చోదకులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది.

కొమిరలో కురుస్తున్న దట్టమైన మంచు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చోడవరం/ రావికమతం, ఫిబ్రవరి 28: వేసవి ప్రారంభమైనా మంచు తీవ్రత వీడడం లేదు. దీంతో రహదారులపై ప్రయాణం ప్రమాదాలను ఆహ్వానిస్తోంది. ఉదయం 9 గంటల వరకు మంచు ప్రభావం ఉండడం తో వాహన చోదకులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ఆదివారం చోడవరం పట్టణాన్ని మంచు దుప్పటి కప్పేసింది. రావికమతం ఏజెన్సీని తలపిస్తోంది. ఉదయం 9 గంటల వరకు మంచు దట్టంగా కురుస్తోం ది. జీడిమామిడి చెట్లపై తేనేలా జిగురుగా పడుతుండడంతో పూత, పిందెకు తీవ్రనష్టం వాటిల్లుతోందని రైతు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తేనె మంచుతో పూత మాడిపోతుందని, మరికొద్దిరోజులు ఇలానే కురిస్తే పంట పూర్తిగా పోతుందంటున్నారు. మరోవైపు మంచు ప్రభావంతో ఇప్పటికే మామిడి పూత మాడిపోయిందని, ఎక్కడా పిందె కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు అప్పులు చేసి మరీ పురుగు మందులు పిచికారీ చేశామని, పంటపై ఆశలను మంచు ముంచేస్తోందని గగ్గోలు పెడుతున్నారు. 

Updated Date - 2021-03-01T05:58:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising