ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయరామరాజుపేట పాల సంఘ ఎన్నికపై రగడ

ABN, First Publish Date - 2021-07-02T05:50:21+05:30

విజయరామరాజుపేట విశాఖ డెయిరీ పాల సంఘం అధ్యక్ష ఎన్నికపై వివాదం నెలకొంది.

పాడి రైతులతో మాట్లాడుతున్న డెయిరీ డైరెక్టర్‌ సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధ్యక్షుడిగా వెంకటరావు ప్రకటనపై అభ్యంతరం

విశాఖ డెయిరీకి కాకుండా ప్రైవేటుగా పాలు విక్రయం


బుచ్చెయ్యపేట, జూలై 1: విజయరామరాజుపేట విశాఖ డెయిరీ పాల సంఘం అధ్యక్ష ఎన్నికపై వివాదం నెలకొంది. అధ్యక్షుడిగా మళ్ల వెంకటరావును ప్రకటించడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు దఫాలుగా పనిచేసిన వ్యక్తిని, ఎన్నిక నిర్వహించకుండా మూడోసారి కూడా ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారని వారు మండిపడ్డారు. సిబ్బందిని సంఘం భవనంలోకి రాకుండా అడ్డుకున్నారు. అలాగే పాలును విశాఖ డెయిరీకి కాకుండా ప్రవేటు డెయిరీకి పంపిస్తున్నారు. విషయం తెలుసుకున్న డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ గురువారం రైతులతో సమావేశమై వివాదానికి కారణాలు తెలుసుకున్నారు. రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన వెంకటరావుతో కుమ్మకైన పీఎస్‌ ప్రసాద్‌, బోనస్‌ కోసం తీసుకున్న తమ సంతకాలతో దొడ్డిదారిన ఎన్నికకు సహకరించారని రైతులు ఆరోపించారు. వెంకటరావు అధ్యక్షుడిగా అంగీకరించేది లేదని తెగేసి చేప్పారు. దీనికి సహకారం అందించిన సిబ్బందిని తక్షణమే బదిలీ చేయాలని, వెంకటరావును పదవి నుంచి తొలగించి తిరిగి ఎన్నిక నిర్వహించాలని పట్టుబడ్డారు. డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లి అధ్యక్ష ఎన్నిక వివాదం పరిష్కారానికి కృషి చేస్తానని సత్యనారాయణ హమీ ఇచ్చారు. సమావేశంలో సర్పంచ్‌ విజయకుమార్‌, మాజీ సర్పంచ్‌ కిశోర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-02T05:50:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising