ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయనగరం, విక్టోరియా, తూర్పు గోదావరి జట్లు గెలుపు

ABN, First Publish Date - 2021-11-30T06:31:32+05:30

వంబరు 29: జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ (వీడీసీఏ) నేతృత్వంలో ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పల్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌, హిందూ ఎఫ్‌ఐసీ ట్రోఫీ క్రికెట్‌ పోటీలు సోమవారం వీడీసీఏ-బి గ్రౌండ్‌లో ప్రారంభమయ్యాయి.

బ్యాటింగ్‌ చేస్తున్న జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పల్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌ క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

విశాఖపట్నం(స్పోర్ట్సు), నవంబరు 29: జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ (వీడీసీఏ) నేతృత్వంలో ఆర్సెలర్‌ మిట్టల్‌ నిప్పల్‌ స్టీల్‌ ఇండియా లిమిటెడ్‌, హిందూ ఎఫ్‌ఐసీ ట్రోఫీ క్రికెట్‌ పోటీలు సోమవారం వీడీసీఏ-బి గ్రౌండ్‌లో ప్రారంభమయ్యాయి. ఈ టోర్నీకి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున ముఖ్య అతిఽథిగా హాజరై మ్యాచ్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వీడీసీఏ ఉపాధ్యక్షుడు డీఎస్‌ వర్మ అధ్యక్షత వహించగా కార్యదర్శి ఎ.పార్థసారధి, సంయుక్త కార్యదర్శి జేకేఎం.రాజు తదితరులు పాల్గొన్నారు. 

తొలిరోజు జరిగిన మ్యాచ్‌ల్లో విజయనగరం, విక్టోరియా, తూర్పుగోదావరి జట్లు గెలుపొందాయి. వీడీసీఏ-బి గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో విజయనగరం 159 పరుగుల తేడాతో మెట్రో సీసీపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విజయనగరం 44 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 391 పరుగుల భారీ స్కోరు చేసింది. జీఎస్‌పీ తేజ అజేయ సెంచరీ(116 నాటౌట్‌) సాధించాడు. లక్ష్య సాధనలో మెట్రో సీసీ 29.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటై ఓటమి చెందింది. ఉక్కు స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో విక్టోరియా సీసీ 143 పరుగుల తేడాతో వైజాగ్‌ కోల్ట్స్‌పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విక్టోరియా 48 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య సాధనలో వైజాగ్‌ కోల్ట్స్‌ 35.2 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. జింక్‌ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో తూర్పు గోదావరి ఎనిమిది వికెట్ల తేడాతో హెచ్‌పీసీఎల్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హెచ్‌పీసీఎల్‌ 27.3 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్‌ కాగా సాధారణ లక్ష్యాన్ని తూర్పు గోదావరి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ 18.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి చేధించి సునాయాస విజయం సొంతం చేసుకుంది.


Updated Date - 2021-11-30T06:31:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising