ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉక్కు పరిరక్షణ బాధ్యత వైసీపీదే’

ABN, First Publish Date - 2021-07-24T05:52:29+05:30

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పదవులను త్యాగాలు చేస్తామని ప్రకటన చేసిన వైసీపీ ఎంపీల తీరు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయని టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ ఆరోపించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రసాదుల శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాజువాక, జూలై 23: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పదవులను త్యాగాలు చేస్తామని ప్రకటన చేసిన వైసీపీ ఎంపీల తీరు చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయని టీడీపీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ ఆరోపించారు. గాజువాక పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన రెండేళ్లపాటు పోలవరం, ప్రత్యేక హోదాపై మౌనం వహించి నేడు స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమం ఉధృతమవుతున్న క్రమంలో ఈ విషయాన్ని పక్కనపెట్టి ప్రత్యేక హోదా, పోలవరంపై ప్రస్తావన చేస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు స్టీల్‌ప్లాంట్‌ అంశం ప్రధాన ఎజెండాగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్‌బాబు, నమ్మి సింహాద్రి, పొట్ల శ్రీనివాస్‌, గుమ్మడి నరేంద్ర, మొల్లి చిన్నోడు, పల్లా పెంటారావు, కొల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-24T05:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising