ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వశిష్ట’ ఫార్మాలో ప్రమాదం

ABN, First Publish Date - 2021-07-24T06:08:42+05:30

విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఓ కంపెనీలో శుక్రవారం డ్రైయర్‌ పేలిన ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందగా, మరో కార్మికుడు గాయపడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కంపెనీలో పేలిన డ్రైయర్‌ 

ఓ కార్మికుడు మృతి, మరో కార్మికుడికి గాయాలు


రాంబిల్లి, జూలై 23: విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఓ కంపెనీలో శుక్రవారం డ్రైయర్‌ పేలిన ఘటనలో ఓ కార్మికుడు మృతిచెందగా, మరో కార్మికుడు గాయపడ్డాడు. ఇందుకు సంబంధించి రాంబిల్లి ఎస్‌ఐ పి.రాజారావు తెలిపిన వివరాలివి. సెజ్‌లో వశిష్ట ఫార్మా ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ ఉంది. అందులో శుక్రవారం సాయంత్రం డ్రైయర్‌ పేలడంతో జార్ఖండ్‌కు చెందిన సోమాముండా (43), అసోంకు చెందిన సజిత్‌ అనే కార్మికులు గాయపడ్డారు. వెంటనే విశాఖ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో సోమాముండా మృతిచెందాడు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారని ఎస్‌ఐ రాజారావు చెప్పారు. ఎలమంచిలి సీఐ ఎస్‌.వెంకటరమణతో పాటు ఎస్‌ఐ రాజారావు ఘటనా స్థలానికి వెళ్లి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.  కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2021-07-24T06:08:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising