ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనలో కార్మికులపై చిన్నచూపు

ABN, First Publish Date - 2021-06-14T05:30:00+05:30

రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులపై చిన్న చూపు చూస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా నాయకుడు కోన లక్ష్మణ ఆవేదన వ్యక్తం చేశారు.

ఉడ్‌పేటలో ధర్నా చేస్తున్న భవన నిర్మాణ కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఐటీయూసీ జిల్లా నాయకుడు కోన లక్ష్మణ

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 14:
రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులపై చిన్న చూపు చూస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా నాయకుడు కోన లక్ష్మణ ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ఉడ్‌పేట వాటర్‌ ట్యాంక్‌ వద్ద సోమవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ మాట్లాడుతూ, పనులు లేక కార్మికులకు ఆర్థికంగా ఇబ్బందిపడేలా ప్రభుత్వం చేసిందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు న్యాయబద్ధంగా రావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను నిలుపుదల చేశారని ఆరోపించారు. అధికారులకు ఎన్ని వినతిపత్రాలు అందించినా స్పందించకపోవడం విచారకరమని వాపోయారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతినిధులు బండారు వెంకటేశ్‌, మద్దాల రాము, వెంకట్‌, నీలంరాజు, అప్పారావు, చిన్ని పాల్గొన్నారు.

Updated Date - 2021-06-14T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising