ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు అనంత పద్మనాభుని జయంతి

ABN, First Publish Date - 2021-09-19T05:44:54+05:30

పద్మనాభంలోని గిరిపై వెలసిన అనంత పద్మనాభస్వామి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు.

కొండపై పూజలందుకుంటున్న అనంత పద్మనాభస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేడుకలకు ఏర్పాట్లు చేసిన దేవస్థానం అధికారులు

పద్మనాభం, సెప్టెంబరు 18: పద్మనాభంలోని గిరిపై వెలసిన అనంత పద్మనాభస్వామి జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే గిరిపై ఉన్న ఆలయానికి సున్నం వేశారు. మెట్ల మార్గంలో తుప్పలను తొలగించి శుభ్రం చేశారు. ఏటా బాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఈ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం అనంతుని గిరిపై ఉన్న స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకీపై ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో నిలుపుతారు. అనంతుని మూలవిరాట్టుకు పంచామృతాభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు జరుపుతారు. భక్తులకు అనంతుని వ్రత కథను వినిపిస్తారు. అనంతుని సామూహిక వ్రతాలను కొండ దిగువన ఉన్న కుంతీమాధవస్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులతో  చేయించడానికి ఏర్పాట్లు చేశారు. 


Updated Date - 2021-09-19T05:44:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising