ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జాబ్‌ లెస్‌’ క్యాలెండర్‌ను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2021-06-24T05:34:51+05:30

ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల ప్రకటించిన జాబ్‌ (లెస్‌) క్యాలెండర్‌ను తక్షణమే రద్దు చేయాలని, వివిధ శాఖల్లో వున్న అన్ని ఖాళీలతో కొత్తగా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ అరకు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు తామర్ల సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ డిమాండ్‌ 



పాడేరు, జూన్‌ 23: ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల ప్రకటించిన జాబ్‌ (లెస్‌) క్యాలెండర్‌ను తక్షణమే రద్దు చేయాలని, వివిధ శాఖల్లో వున్న అన్ని ఖాళీలతో కొత్తగా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని తెలుగునాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ అరకు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు తామర్ల సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. జాబ్‌ (లెస్‌) క్యాలెండర్‌కు వ్యతిరేకంగా టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నేతలు బుధవారం ఇక్కడ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, రెండేళ్ల తరువాత అరకొర పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించారని విమర్శించారు. డీఎస్‌సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని హమీ ఇచ్చిన జగన్‌, జాబ్‌ క్యాలెండర్‌లో టీచర్‌ పోస్టుల ప్రస్తావనే లేకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-24T05:34:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising