ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూర్తిస్థాయిలో పరిహారం ఇచ్చాకే పనులు

ABN, First Publish Date - 2021-10-26T06:12:56+05:30

విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం మండలంలోని పలు గ్రామాల్లో భూములిచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చిన తరువాతే పనులు ప్రారంభించాలని ఈ ప్రాంత రైతులు స్పష్టం చేశారు.

ఏడీబీ ప్రతినిధులకు వినతి పత్రం అందజేస్తున్న రైతు సంఘం ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


   బ్యాంకు ప్రతినిధులకు తేల్చి చెప్పిన విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ రైతులు 

నక్కపల్లి, అక్టోబరు 25 : విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం  మండలంలోని పలు గ్రామాల్లో భూములిచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో పరిహారం ఇచ్చిన తరువాతే పనులు ప్రారంభించాలని ఈ ప్రాంత రైతులు స్పష్టం చేశారు. ఏషియన్‌ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) ప్రతినిధులు అమలాపురం, మూలపర్ర, పాటిమీద గ్రామాల రైతులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూములిచ్చిన రైతులకు పూర్తి స్థాయి లో ప్యాకేజీ ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి ఎటువంటి ప్యాకేజీ ఇవ్వాలనే అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని సదరు బ్యాంకు ప్రతినిధి డాక్టర్‌ ప్రపుల్‌ తెలిపారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రజలకు, రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని అమలాపురం సర్పంచ్‌ పి. శంకరరావు, ఉప సర్పంచ్‌ గంటా నర్సిం గరావు, వైసీపీ నాయకుడు సూరకాసుల గోవింద్‌ డిమాండ్‌ చేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం జిరాయితీ భూములకు సమానంగా డి.పట్టా భూములు, సాగుభూముల రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు. అంతవరకూ ఈ భూముల్లో ఎటువంటి పనులు చేయకూడదన్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.  స్థానికులు బాబ్జీ, నూకరాజు, గోవింద్‌, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T06:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising