ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయ్యన్నను విమర్శించే హక్కు వైసీపీకి లేదు

ABN, First Publish Date - 2021-09-19T05:25:09+05:30

రాష్ట్రంలోనే నిబద్ధత కలిగిన నాయకుడిగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని విమర్శించే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌(టీడీపీ) గంధం శ్రీనివాస్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గంధం శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గంధం శ్రీనివాస్‌

గాజువాక, సెప్టెంబరు 18: రాష్ట్రంలోనే నిబద్ధత కలిగిన నాయకుడిగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని విమర్శించే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌(టీడీపీ) గంధం శ్రీనివాస్‌ అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాట్లాడే తీరు అభ్యంతరకంగా ఉందన్నారు. ఇలాంటి వారు ఆత్మ పరీశీలన చేసుకుని బీసీ వర్గానికి చెందిన అయ్యన్నపాత్రుడుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. టీడీపీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ వైసీపీ నాయకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు, నాయకులు శ్రీనివాసవర్మ, మాడిస వెంకరమణ, బలగ బాలునాయుడు, పొలిరాజు, నరసింహ పాల్గొన్నారు. 



Updated Date - 2021-09-19T05:25:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising