ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడిన సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2021-01-27T05:53:20+05:30

సుప్రీంకోర్టు తమ తీర్పు ద్వారా రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత

అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం

డాబాగార్డెన్స్‌ , జనవరి 26: సుప్రీంకోర్టు తమ తీర్పు ద్వారా రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడిందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ మంగళవారం డాబాగార్డెన్స్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి టీడీపీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం, రాజ్యాంగ సంస్థలపై వైసీపీ ప్రభుత్వానికి గౌరవం లేదని విమర్శించారు. ఉద్యోగ సంఘ నేతలు పార్టీ నాయకులుగా వ్యవహరిస్తూ మిగతా ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. టీడీపీ విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వైసీపీ ప్రభుత్వం అయోమయంలో పడిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుచ్చా విజయ్‌కుమార్‌, ఎండీ నజీర్‌, సనపల పాండురంగారావు, దొడ్డి బాపు ఆనంద్‌, వానపల్లి రవికుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:53:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising