ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి

ABN, First Publish Date - 2021-08-03T06:06:48+05:30

ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని 75వ వార్డు కార్పొరేటర్‌ పులి లక్ష్మీబాయి అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 172వ రోజు కొనసాగాయి

దీక్షా శిబిరంలో పాల్గొన్న కార్పొరేటర్‌ పులి లక్ష్మీబాయి, మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూర్మన్నపాలెం, ఆగస్టు 2: ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని 75వ వార్డు కార్పొరేటర్‌ పులి లక్ష్మీబాయి అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 172వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షలలో ఉక్కు ఉద్యోగుల భార్యలు, మహిళలు కూర్చున్నారు. ఈ శిబిరానికి లక్ష్మీబాయి విచ్చేసి తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉక్కు ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. తెలుగు మహిళ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంత లక్ష్మి మాట్లాడుతూ మహిళా గర్జనతో పోరాటాలు విజయం సాధించాయన్నారు. ఉక్కు ఉద్యోగుల దీక్షలకు తెలుగు మహిళలు, నిర్వాసిత కాలనీ మహిళల మద్దతు ఇస్తున్నారన్నారు.  ఈ కార్యక్రమంలో దీప్తి లెనిన్‌, సుజాత, ఉమా, సంపూర్ణం, ప్రభాకర్‌ రెడ్డి, అప్పల రెడ్డి, దొమ్మేటి సోము నాయుడు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-03T06:06:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising