ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమంపై ఉక్కు పాదం తగదు

ABN, First Publish Date - 2021-10-27T06:29:53+05:30

ఆదివాసీ ఉద్యమంపై అధికారులు ఉక్కుపాదం మోపడం తగదని, ఉద్యమాల్లో పాల్గొనే గిరిజన ఉద్యోగులకు జారీ చేసిన నోటీసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు.

విలేకర్లతో మాట్లాడుతున్న అప్పలనర్స
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



ఉద్యోగులకు ఇచ్చిన నోటీసులు ఉపసంహరించుకోవాలి 

ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స

పాడేరు, అక్టోబరు 26: ఆదివాసీ ఉద్యమంపై అధికారులు ఉక్కుపాదం మోపడం తగదని, ఉద్యమాల్లో పాల్గొనే గిరిజన ఉద్యోగులకు జారీ చేసిన నోటీసులు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు. మంగళవారం ‘ఆదివాసీ ఉద్యమంపై సర్కారు ఉక్కుపాదం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన కథనానికి గిరిజన సంఘం నేతలు స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో గిరిజన తెగల తొలగింపు, జీవో-3 రద్దు వంటి ప్రధానమైన సమస్యలపై ఉద్యమిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలను నోటీసుల ద్వారా బెదిరించడం సరికాదన్నారు. ప్రభుత్వం గిరిజనులకు ఒకవైపు అన్యాయం చేస్తూ, న్యాయం చేయమని పోరాటాలు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని చూస్తే ఐక్య ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అలాగే ఆదివాసీ జేఏసీ 27న తలపెట్టిన నిరసన ర్యాలీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ఆదివాసీల పక్షాల జరిపే ప్రతి ఉద్యమం, పోరాటానికి గిరిజన సంఘం మద్దతుగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు, జిల్లా ఉపాధ్యక్షుడు పృఽధ్వీరాజ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-27T06:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising