ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వరంగ సంస్థల విక్రయం దుర్మార్గం

ABN, First Publish Date - 2021-05-15T05:10:09+05:30

ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టాలని చూడటం చాలా దుర్మార్గమని స్టీల్‌ డివిజన్‌ సీపీఎం కార్యదర్శి కేఎం శ్రీనివాస్‌ అన్నారు.

రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టీల్‌ డివిజన్‌ సీపీఎం కార్యదర్శి కేఎం శ్రీనివాస్‌

కూర్మన్నపాలెం, మే 14: ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టాలని చూడటం చాలా దుర్మార్గమని  స్టీల్‌ డివిజన్‌ సీపీఎం కార్యదర్శి కేఎం శ్రీనివాస్‌ అన్నారు. కూర్మన్నపాలెంలో స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు 92వ రోజు కొనసాగాయి. శుక్రవారం ఈ దీక్షలలో ఆర్‌ఎంహెచ్‌పీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో విశాఖ ఉక్కుకు సముచిత స్థానముందని, ఉక్కు కర్మాగారంపై జరుగుతున్న దాడిని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని అన్నారు.  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ద్వారానే రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం గల నియోజకవర్గంగా గాజువాక గుర్తింపు పొందిందని అన్నారు. ఉక్కు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ శిబిరంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు గంధం వెంకటరావు, కె.సత్యనారాయణ, వేంకటేశ్వరరావు, రాజేశ్వరరావు, జయ, శ్రీనివాస్‌, అప్పలరాజు, రమణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-15T05:10:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising