ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిటకిటలాడిన రుషికొండ బీచ్‌

ABN, First Publish Date - 2021-10-18T05:49:30+05:30

రుషికొండ బీచ్‌ ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది.

సందర్శకులతో సందడిగా ఉన్న రుషికొండ సాగరతీరం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దసరా సెలవులతో పెద్దసంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు

సాగర్‌నగర్‌, అక్టోబరు 17: రుషికొండ బీచ్‌ ఆదివారం సందర్శకులతో కిటకిటలాడింది. దసరా సెలవులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు, బెంగాలీ, ఒడిశా, తదితర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులతో బీచ్‌లు సందడిగా కనిపించాయి. పలువురు ఇసుకతెన్నులపై సరదాగా కాలక్షేపం చేయగా, మరికొందరు సముద్ర స్నానాలు చేస్తూ ఉల్లాసంగా..ఉత్సాహంగా గడిపారు. బీచ్‌లో ఏపీ టూరిజం నిర్వహిస్తున్న బోటు షికార్‌ చేసేందుకు ఎక్కువ మంది సందర్శకులు ఉత్సాహం చూపారు. సందర్శకుల తాకిడి పెరగడంతో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థకు పార్కింగ్‌ ఆదాయం భారీగానే సమకూరింది. ఆకాశం మేఘావృతంగా ఉండడం.. కెరటాలు ఎగసిపడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంతో సందర్శకులు ఆనందంగా గడిపారు.


జూ ఆదాయం రూ.3.80 లక్షలు

ఆరిలోవ: ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు ఆదివారం  అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. దసరా సెలవుల కారణంగో జూకు సందర్శకుల తాకిడి పెరిగింది. సుమారు 5,997 మంది సందర్శకులు వచ్చినందున రూ.3.80 లక్షల ఆదాయం జూకు వచ్చినట్టు జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందనీ సలారియా తెలిపారు.


Updated Date - 2021-10-18T05:49:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising