ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టాఫ్‌ నర్సుల సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-06-18T05:24:59+05:30

కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం జిల్లా ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు.

జిల్లా ఆస్పత్రి వద్ద ధర్నా చేపట్టిన కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ నర్సులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాడేరురూరల్‌, జూన్‌ 17: కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌ నర్సుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం జిల్లా ఆస్పత్రి వద్ద ధర్నా నిర్వహించారు. కరోనా కాలంలో ప్రజలకు విస్తృతంగా సేవలు అందించిన నర్సులు, ఇతర వైద్య ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కె.కృష్ణారావుకు వినతిపత్రం అందించారు. కాంట్రాక్టు వైద్య ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడం అన్యాయమన్నారు. కరోనా కాలంలో మృతి చెందిన రెగ్యులర్‌ వైద్య సిబ్బందికి మాత్రమే ఎక్షగ్రేషియా అందించే విధంగా జీవో 299 విడుదల చేయడం అన్యాయమన్నారు. కరోనా కాలంలో విధులు నిర్వహిస్తూ 20 మంది స్టాఫ్‌ నర్సులు మృతి చెందారని, వారి కుటుంబాలకు రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలని డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 28న సమ్మె చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్‌ నర్సులు, వైద్యసిబ్బంది విజయశాంతి, ప్రయాంక, అప్పలనర్సమ్మ, సింహలక్ష్మి, గణేష్‌పడాల్‌, లవకుశ, అప్పలస్వామి, సూర్యచంద్ర, ఎలీషారావు, సీఐటీయూ మండల నాయకుడు ఎల్‌.సుందరరావు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-06-18T05:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising