ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైట్‌ డ్యూటీ అలవెన్స్‌ పరిమితి ఎత్తేయాలి

ABN, First Publish Date - 2021-01-22T05:53:15+05:30

రైల్వే స్టేషన్‌ మాస్టర్లకు ఇచ్చే నైట్‌ అలవెన్స్‌పై విధించిన పరిమిత, అర్హత నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ ఆలిండియా స్టేషన్‌ మాస్టర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు విశాఖలో డీఆర్‌ఎం కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేశారు.

దీక్షలో పాల్గొన్న స్టేషన్‌ మాస్టర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైల్వే స్టేషన్‌ మాస్టర్ల డిమాండ్‌

విశాఖపట్నం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రైల్వే స్టేషన్‌ మాస్టర్లకు ఇచ్చే నైట్‌ అలవెన్స్‌పై విధించిన పరిమిత, అర్హత నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ ఆలిండియా స్టేషన్‌ మాస్టర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు విశాఖలో డీఆర్‌ఎం కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ వాల్తేరు డివిజన్‌ సెక్రటరీ పీఎన్‌ మూర్తి మాట్లాడుతూ కొత్తగా అమలులోకి తెచ్చిన నిబంధనల వల్ల రూ.49 వేల పైబడి ప్రాథమిక వేత నం పొందుతున్న స్టేషన్‌ మాస్టర్లు అంతా నైట్‌ అలవెన్స్‌ కోల్పోతారన్నారు. 24 గంటలు విధులు నిర్వహించే స్టేషన్‌మాస్టర్లకు ఇలాంటి నిబంధనలు వర్తించడం తగదని, వెంటనే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆలిండియా అసోసియేషన్‌ నిర్ణయం మేరకు తదుపరి ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ ధర్నాలో వాల్తేరు డివిజన్‌లోని 50 మంది స్టేషన్‌ మాస్టర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-22T05:53:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising