ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే మా కుమార్తెను బలిగొంది..

ABN, First Publish Date - 2021-12-09T05:54:27+05:30

పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిందని, తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మండల విద్యాశాఖాఽధికారి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంఈవో సునీతతో మాట్లాడుతున్న కార్పొరేటర్‌ పీలా శ్రీనివాసరావు, బాలిక తల్లిదండ్రులు, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యాయం చేయాలంటూ ఎంఈవోను వేడుకున్న మృతి చెందిన విద్యార్థిని తల్లిదండ్రులు

ఉపాధ్యాయురాలు సస్పెన్షన్‌

పెందుర్తి, డిసెంబరు 8: పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిందని, తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మండల విద్యాశాఖాధికారి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పాత పెందుర్తిలోని ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న భావన (7) మంగళవారం స్కూల్‌ నుంచి బయటకు వచ్చినప్పుడు లారీ ఢీకొని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఎంఈవో సునీత బుధవారం పాఠశాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు ఈ సందర్భంగా బాలిక కుటుంబ సభ్యులు ఎంఈవోను కలిసి తమ గోడును వివరించి కన్నీటిపర్యంతమయ్యారు. బాలిక తల్లి వరలక్ష్మి మాట్లాడుతూ తాను ఇదే  పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం వంటకు సహాయకురాలిగా పనిచేస్తున్నట్టు తెలిపింది. సహచర విద్యార్థిని వాష్‌రూమ్‌కి వెళతానంటే తోడుగా తన కుమారై భావనను ఉపాధ్యాయురాలు బయటకు పంపారని, వారు తిరిగి పాఠశాలకు వస్తుండగా తమ కుమార్తెను లారీ ఢీకొనడంతో మృతి చెందిందన్నారు. పాఠశాలలోని బాత్‌రూమ్‌లను విద్యార్థులు వినియోగించకుండా ఉపాధ్యాయులు కట్టడి చేస్తున్నారని, అదే తమ కుమార్తెను బలిగొందన్నారు. 96వ వార్డు కార్పొరేటర్‌ పీలా శ్రీనివాసరావు బాలిక మృతికి పాఠశాల ఉపాధ్యాయుల తప్పిదమే కారణమని వివరించారు. 


ఉపాధ్యాయురాలు సస్పెన్షన్‌

పాఠశాల విద్యార్థిని భావన మృతికి సంబంధించిన నివేదికను జిల్లా విద్యాశాఖాధికారికి నివేదించామని ఎంఈవో సునీత తెలిపారు. డీఈవో ఆదేశాలల మేరకు ఉపాధ్యాయురాలు ఉషారాణిని సస్పెండ్‌ చేశామన్నారు. మండల విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు చేపడుతున్నామని ఆమె పేర్కొన్నారు.


Updated Date - 2021-12-09T05:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising