ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం

ABN, First Publish Date - 2021-09-18T05:51:54+05:30

ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు


అనకాపల్లి టౌన్‌, సెప్టెంబరు 17: ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక కర్షక నిలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ గద్దెనెక్కిన తరువాత దేశంలో ప్రజలు 93 శాతం అప్పులపాలయ్యారన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక బేరల్‌ ముడిచమురు ధర 169 డాలర్లు ఉన్నప్పుడు దేశంలో పెట్రోల్‌ ధర లీటరు రూ.65 ఉండేదని, ప్రస్తుతం బేరల్‌ ధర 69 డాలర్లకు తగ్గినప్పటికీ పెట్రోల్‌ ధర రూ.108 పెరగడం విచారకరమని వాపోయారు. ఇందుకు నిరసనగా 27న చేపట్టే భారత్‌బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సమావేశంలో కౌలు రైతుల సంఘం ప్రతినిధులు పి.జములయ్య, ఎ.బాలకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T05:51:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising