ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థినుల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు!

ABN, First Publish Date - 2021-04-19T05:25:35+05:30

మండలంలోని ఆర్‌వీనగర్‌ గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల ఆరో గ్యాన్ని ఉపాధ్యాయులు గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మండుటెండలో ఆస్పత్రి నుంచి వెళ్తున్న విద్యార్థినులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం 

 జ్వరంతో కాలినడకన ఆస్పత్రికి వెళ్లిన బాలికలు 

గూడెంకొత్తవీధి, ఏప్రిల్‌ 18: మండలంలోని ఆర్‌వీనగర్‌ గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల ఆరో గ్యాన్ని ఉపాధ్యాయులు గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలలో సుమారు పది మంది విద్యార్థినులు జ్వరంతో బాధపడుతున్నా పట్టించుకోలేదని, దీంతో వారంతా మండుటెండలో రెండు కిలోమీటర్ల దూరంలోనున్న ఆస్పత్రికి కాలినడకన వెళ్లి చికిత్స చేయించుకుని తిరిగి పాఠశాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందంటున్నారు. అయితే విద్యార్థుల వెంట ఉపాధ్యాయులుగాని, ఉద్యోగులు గానీ లేకపోవడం గమనార్హం. ఆర్‌వీనగర్‌  శివారులో టీడబ్ల్యు బాలికల ఆశ్రమ పాఠశాల ఉంది. ఇక్కడ పది మంది విద్యార్థినులు రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ బాలికకు ఫిట్స్‌ కూడా వచ్చింది. అయితే బాలికలను ఉపాధ్యాయులు ఆస్పత్రికి తీసుకు వెళ్లి వైద్య సేవలందించాలి. కానీ పట్టించుకోకపోవడతో వారే ఆర్‌వీనగర్‌ పీహెచ్‌సీకి వచ్చారు. నీరసంగా ఉన్నప్పటికీ మండుటెండలో కాలినడకన వచ్చి వెళ్లారు. వారివెంట ఎవరూ లేకపోవడంపై పాడేరు డీడీ విజయ్‌కుమార్‌ దృష్టికి తీసుకు వెళ్లగా, దీనిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-04-19T05:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising