ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాచకుని ఆఖరి మజిలీ..

ABN, First Publish Date - 2021-05-11T05:06:53+05:30

కరోనా కరాళనృత్యం చేస్తున్న తరుణంలో ఎవరైనా కాలం చెందినా అయిన వాళ్లు సైతం కడసారిగా చూపునకు నోచుకోలేని రోజులి.. ఇటువంటి పరి స్థితుల్లో ఓ యాచకుని మృదేహానికి అన్నీ తామై అంతిమ కార్యక్రమాలు నిర్వహించి గొలుగొండ పోలీసులు వారి గొప్ప మనసును చాటుకు న్నారు.

మృతదేహాన్ని ఖననం చేయిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  అయినవారు లేకపోయినా...అన్నీ తామైన గొలుగొండ పోలీసులు

గొలుగొండ, మే 10 : కరోనా కరాళనృత్యం చేస్తున్న తరుణంలో ఎవరైనా కాలం చెందినా అయిన వాళ్లు సైతం కడసారిగా చూపునకు నోచుకోలేని రోజులి.. ఇటువంటి పరి స్థితుల్లో ఓ యాచకుని మృదేహానికి అన్నీ తామై అంతిమ కార్యక్రమాలు నిర్వహించి గొలుగొండ పోలీసులు వారి గొప్ప మనసును చాటుకు న్నారు. మండలంలోని జోగంపేటలో ఓ యాచకుడు గత కొన్నాళ్లుగా తిరుగుతూ.. ఈ నెల ఆరో తేదీ సాయం త్రం గ్రామ సమీపంలోని పంట పొల్లాల్లో మృతిచెందాడు. ఈ విషయం గ్రామస్థుల ద్వారా తెలుసుకున్న  ఎస్‌ఐ ధనుంజయనాయుడు మర్నాడు మృతదేహాన్ని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో భద్రపర్చారు. ఈ సమాచారాన్ని వివిధ పోలీస్టేషన్లతో పాటు మీడియాకు వివరించారు.  మృతుడి బంధువుల కోసం నాలుగు రోజులు వేచి చూశారు. అయినప్పటికీ ఎవరూ రాకపోవడంతో చివరకు సోమవారం సాయంత్రం గ్రామంలోని శ్మశాన వాటికలో టార్చ్‌లైట్‌ వెలుతురులో ఖననం పూర్తిచేశారు. 

Updated Date - 2021-05-11T05:06:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising