ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీ గౌరవాన్ని మంటగలిపారు

ABN, First Publish Date - 2021-11-21T06:23:31+05:30

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణిపై అసెంబ్లీలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మం డలంలోని జల్లూరు జంక్షన్‌ వద్ద టీడీపీ నాయకులు శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు.

కోటవురట్ల మండలం జల్లూరులో టీడీపీ నాయకుల కొవ్వొత్తుల ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణుల నిరసన 

 అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం 

కోటవురట్ల, నవంబరు 20 : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణిపై అసెంబ్లీలో అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మం డలంలోని జల్లూరు జంక్షన్‌ వద్ద టీడీపీ నాయకులు శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు.  పార్టీ మండల శాఖ అధ్య క్షుడు  లాలం కాశీనాయుడు ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ గౌర వాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు మంట గలపారని మండిపడ్డారు. వెంటనే వారిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

నక్కపల్లి : చంద్రబాబునాయుడు సతీమణిపై అసెంబ్లీలో వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం ఎస్‌.రాయవరం పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గుర్రం రామకృష్ణ, పల్లెల బుజ్జి, కోన అప్పలరాజు, అమలకంటి అబద్దం, కందుల నాగేశ్వరరావు, ఎస్‌.అచ్యుత్‌ తదితరులు పాల్గొన్నారు.

పాయకరావుపేట : అసెంబ్లీలో చంద్రబాబుపై వైసీపీకి చెందిన మం త్రులు, ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం అమానుషమని టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గొర్లె రాజబాబు అన్నారు. శనివారం పాయకరావుపేటలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీని ప్రజలు నమ్మి గెలిపిస్తే.. పాలనను గాలికి వదిలి, ప్రతిపక్ష  పార్టీ నాయకులను వేధించ డమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇకనైనా సదరు పార్టీ నాయకులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు.   నాయకులు మజ్జూరి నారాయణరావు, రావాడ గోవిందరెడ్డి, కుప్పిలి సురేష్‌రెడ్డి, భజంత్రీల శివ, గొల్లపల్లి నాగు, సకిలేటి నాగేశ్వరరావు, పడాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, నందమూరి కుటుంబానికి చెందిన భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్‌ చేయాలని పాయకరావుపేట నందమూరి కల్చరల్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు చింతకాయల రాం బాబు డిమాండ్‌ చేశారు. అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. నందమూరి అభిమానులు దిబ్బ శ్రీను, దేవవరపు గోవింద్‌, కట్టా శ్రీను, దొంగల శ్రీను, గదుల అచ్చిబాబు, బత్తిన గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-21T06:23:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising