ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తాండవ’ చెరకు బకాయిలు చెల్లించాలి

ABN, First Publish Date - 2021-12-04T06:18:43+05:30

తాం డవ సహకార చక్కెర కర్మాగారానికి గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు చెల్లిం పులు చేపట్టడంతో పాటు కార్మికులకు జీతాల బకాయిలను ఫ్యాక్టరీ యాజమ్యానం తక్షణమే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు డిమాండ్‌ చేశారు.

దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  ఫ్యాక్టరీ గేటు ఎదుట ఆందోళనలో  సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నరసింగరావు డిమాండ్‌

పాయకరావుపేట, డిసెంబరు 3 : తాం డవ సహకార చక్కెర కర్మాగారానికి గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు  చెల్లిం పులు చేపట్టడంతో పాటు కార్మికులకు జీతాల బకాయిలను ఫ్యాక్టరీ యాజమ్యానం తక్షణమే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు డిమాండ్‌ చేశారు. పాయకరావుపేటలోని తాండవ షుగర్స్‌ ఫ్యాక్టరీ గేటు ఎదుట  శుక్రవారం  ఏపీ రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో చెరకు రైతులు, కార్మికులు నిరసన దీక్షతో పాటు వంటా- వార్పు చేపట్టారు. ఈ సందర్భంగా  నరసింగరావు మాట్లాడుతూ నాలుగు నియోజకవర్గాల చెరకు రైతులు జీవనాధారంగా భావించే తాండవ షుగర్స్‌ను అన్నివిధాలా ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గతేడాది చెరకు సరఫరా చేసిన రైతులకు సకాలంలో బిల్లులు, కార్మికులకు జీతాలు  చెల్లించకపోతే వారి కుటుంబాలు ఎలా బతుకుతాయని ప్రశ్నించారు.  ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు వెంటనే చెల్లించి, 2021-22 సీజన్‌కు ఫ్యాక్టరీ నడిపించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందో ళనను మరింత ఉధృతం చేస్తామని, ఇందులో భాగంగా ఈనెల 23న జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని చెప్పారు. రైతు సంఘం నాయకులు కె.లోకనాథం, నాగేశ్వరరావు, సీఐ టీయూ నాయకులు ఎం.అప్పలరాజు, శేషుబాబ్జీ, కోటేశ్వరరావు, కర్రి అప్పారావు, రాజు, పద్మ, శ్రీను, కార్మిక నాయకులు శ్రీనివాసరావు, రమణ, సాల్మన్‌రాజుతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T06:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising