ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటీఎస్‌ రద్దు చేయాలని టీడీపీ శ్రేణుల నిరసన

ABN, First Publish Date - 2021-12-07T05:23:21+05:30

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద అమలు చేస్తున్న ఓటీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం వాడచీపురుపల్లి పంచాయతీ పరిధి ఎస్సీ కాలనీలోని అంబేడ్కర్‌ విగ్రహాం ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.

అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన తెలుపుతున్న టీడీపీ శ్రేణులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరవాడ, డిసెంబరు 6: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద అమలు చేస్తున్న ఓటీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం వాడచీపురుపల్లి పంచాయతీ పరిధి ఎస్సీ కాలనీలోని అంబేడ్కర్‌ విగ్రహాం ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు మాట్లాడుతూ ఓటీఎస్‌ పేరుతో పేద ప్రజల వద్ద రూ.10 వేలు చొప్పున వసూలు చేయడం చరిత్రలో ఎప్పుడూ  జరగలేదని, వైసీపీ ప్రభుత్వంలోనే వసూళ్ల దందా కొనసాగుతోందని మండి పడ్డారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం పాదాల వద్ద వినతి పత్రాన్ని ఉంచి మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, అట్టా సన్యాసిఅప్పారావు, వియ్యపు చిన్నా, బొండా సన్నిదేముడు, ఒమ్మి వెంకటరావు, రొంగలి గోపాలకృష్ణ, గొర్లి శ్రీనివాస్‌, సారిపల్లి జోగినాయుడు, బొండా తాతారావు, తదితరులు పాల్గొన్నారు.

మొగలిపురంలో..

సబ్బవరం: ఓటీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ నాయకులు మొగలిపురంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, మాజీ ఎంపీపీ గండి దేముడు, కార్పొరేటర్లు బల్ల శ్రీనివాసరావు, రాపర్తి కన్నా, పీవీ నర్సింహం, ఎంపీటీసీ తమరాన బంగారునాయుడు, బైలపూడి సత్యం, అంగటి నానాజీ, జి. అప్పారావు, డి. ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-07T05:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising