ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నుల బాదుడుపై టీడీపీ నిరసన

ABN, First Publish Date - 2021-07-27T06:15:25+05:30

కరోనా వైరస్‌ వలన ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధించడం దుర్మార్గమని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

ధర్నాలో పాల్గొన్న టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాజువాక, జూలై 26: కరోనా వైరస్‌ వలన ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జీవీఎంసీ అధికారులు ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధించడం దుర్మార్గమని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆస్తి పన్ను పెంపు, చెత్త పన్ను విధింపునకు నిరసనగా సోమవారం గాజువాకలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు పర్యటనకు వస్తున్న మేయర్‌, కమిషనర్‌, ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీయాలన్నారు. జీవీఎంసీ ఎన్నికల ముందు ఎటువంటి పన్నులు పెంచమని హామీ ఇచ్చిన నాయకులు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. పన్ను పెంపు జీవోలను ఉపసంహరించుకపోతే తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌లు గంధం శ్రీనివాస్‌, పల్లా శ్రీనివాస్‌, రౌతు శ్రీనివాసరావు, పార్టీ గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, టీడీపీ ఉపాధ్యక్షుడు ఎండి రఫీ పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-27T06:15:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising