ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫలించిన ఆంధ్రజ్యోతి పోరాటం.. వైసీపీ నేతల్లో గుబులు

ABN, First Publish Date - 2021-07-30T21:25:07+05:30

టీడీపీ నేతల పోరాటం ఫలించింది. బాక్సైట్ తవ్వకాలపై టీడీపీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. వైసీపీ కనుసన్నల్లో నడుస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాక్సైట్ తవ్వకాలపై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు  


వైసీపీ కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేసిన ఏబీఎన్


ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలపై స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్


లేటరైట్ ముసుగులో గిరిజన బతుకులు ఛిద్రం చేస్తూ.. వైసీపీ సాగిస్తున్న బాక్సైట్ దందాపై స్పందించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్


ఢిల్లీ: అక్రమ మైనింగ్‌పై ఆంధ్రజ్యోతి పోరాటం ఫలించింది. మైనింగ్ పేరుతో అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) విశాఖ మన్యంలో లేటరైట్ తవ్వకాలపై విచారణ కమిటీ ఏర్పాటు కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.వైసీపీ కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేస్తూ... బాక్సైట్ తవ్వకాలపై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. లేటరైట్ ముసుగులో గిరిజన బతుకులు ఛిద్రం చేస్తున్న వైనంపై ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు రావడంతో వైసీపీ సాగిస్తున్న ఈ బాక్సైట్ దందాపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్పందించింది. అటవీశాఖ అనుమతులు లేకుండానే వేలాది వృక్షాలను ధ్వంసం చేసి.. రోడ్డు నిర్మాణం చేయడాన్ని ఎన్జీటీ తప్పుబట్టింది. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతించిన పరిధి దాటి తూ.గో., విశాఖ జిల్లాల్లో అక్రమ మైనింగ్ చేసినట్లు గుర్తించింది. ఫలితంగా తక్షణమే గనుల శాఖ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని, అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని  ఎన్జీటీ ఆదేశించింది. అక్రమాలపై విచారణ చేపట్టేందుకు కమిటీ ఏర్పాటు చేసిన ఎన్జీటీ కమిటీలో కేంద్ర అటవీశాఖ, రాష్ట్ర గనులశాఖ, పీసీబీ అధికారులు, విశాఖ కలెక్టర్ ఉన్నారు. అక్రమ మైనింగ్ ప్రాంతంలో పర్యటించి అనుమతులు, రోడ్డు నిర్మాణం, అక్రమ మైనింగ్‌పై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఎన్జీటీ రంగంలోకి దిగడంతో వైసీపీ బాక్సైట్ మాఫియాలో ఆందోళన మొదలైంది.

Updated Date - 2021-07-30T21:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising