ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చేయూత పథకం’ మోసం

ABN, First Publish Date - 2021-06-24T04:05:09+05:30

వైఎస్సార్‌ చేయూత పథకం మహిళలను మోసం చేసే ‘జగన్‌రెడ్డి మాయ’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌నజీర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ నజీర్‌

మహారాణిపేట, జూన్‌ 23: వైఎస్సార్‌ చేయూత పథకం మహిళలను మోసం చేసే ‘జగన్‌రెడ్డి మాయ’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌నజీర్‌ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సంక్షేమ పథకాలన్నీ మోసం, బూటకమని ఆరోపించారు. ఎన్నికల ముందు 45 ఏళ్లు దాటిన వారందరికీ పింఛన్లు ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అమలు చేయలేదన్నారు.


రాష్ట్రంలో 45 ఏళ్లుపైబడిన మహిళలు దాదాపు కోటి మంది ఉంటారని, కానీ ప్రభుత్వం 23 లక్షల మందికే చేయూత పథకం అందించి చేతులు దుపుపుకుందన్నారు. అదే టీడీపీ ప్రభుత్వ హయాంలో  93 లక్షల మందికి పసుపు, కుంకుమ అందించిన విషయాన్ని గుర్తు చేశారు. అర్హులైన చాలామందికి చేయూత అందడం లేదంటే దగా చేయడం కాదా? అని ప్రశ్నించారు. చేయూత సొమ్ముతో ఆవులు, గేదెలు కొనుగోలుచేసి వాటి పాలను అమూల్‌ సంస్థకు విక్రయించాలని నిబంధన పెట్టడం సరికాదన్నారు.

Updated Date - 2021-06-24T04:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising