ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు తీర్పుతో వాస్తవం తెలిసింది

ABN, First Publish Date - 2021-01-20T05:30:00+05:30

రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిదని, ప్రభుత్వం చేసిన ఆరోపణలన్నీ ఉత్తివేనని దీంతో తేలిపోయిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌నజీర్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మహ్మద్‌నజీర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ దుష్ప్రచారం అని తేలింది

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌నజీర్‌

మహారాణిపేట, జనవరి 20: రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులాంటిదని, ప్రభుత్వం చేసిన ఆరోపణలన్నీ ఉత్తివేనని  దీంతో తేలిపోయిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌నజీర్‌ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం పూర్తయితే చంద్రబాబుకు పేరు వస్తుందన్న అక్కసుతో ప్రభుత్వం కేసు వేసిందని ఆరోపించారు.


టీడీపీ ప్రభుత్వం బంగారంలాంటి రాజధాని నిర్మాణానికి కృషిచేస్తే, వైసీపీ ప్రభుత్వం దాని నాశనానికి కంకణం కట్టుకుందన్నారు. బూతుమంత్రులు, కబ్జా నాయకులు, సచివాలయ, వార్డు వలంటీర్లు ప్రైవేటు సైన్యంలామారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ నాయకులు రహ్మతుల్లా, గౌస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-20T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising