ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్ఙి

ABN, First Publish Date - 2021-10-24T05:21:41+05:30

కెమికల్‌ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భీమిలి ఫస్ట్‌ అడిషినల్‌ సివిల్‌ జడ్జి జి.విజయలక్ష్మి పేర్కొన్నారు.

న్యాయ అవగాహన సదస్సులో మాట్లాడుతున్న విజయలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమిలి ఫస్ట్‌ అడిషనల్‌ సివిల్‌ జడ్జి జి.విజయలక్ష్మి 

భీమునిపట్నం(రూరల్‌), అక్టోబరు 23: కెమికల్‌ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భీమిలి ఫస్ట్‌ అడిషనల్‌ సివిల్‌ జడ్జి జి.విజయలక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని చిప్పాడ దివీస్‌ కర్యాగారంలో శనివారం సాయంత్రం జరిగిన న్యాయ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రమాదాలకు ఎటువంటి పరిహారాలు అందుతాయన్న విషయాన్ని కూడా యాజమాన్యాలే కార్మికులకు తెలియజేయాలన్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని అమలు చేసే బాధ్యతను యాజమాన్యాలు తీసుకోవాలని కోరారు. అందరికీ న్యాయం అందించాలంటే ముందుగా కార్మికులకు న్యాయ అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దివీస్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.ఎస్‌.ఎన్‌.రావు, భీమిలి బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వెంకటేశ్వరరావు, న్యాయవాది సుధాకర్‌, లోక్‌ అదాలత్‌ సభ్యులు పి.సుందర్‌చంద్‌, పార్వతీశం, అడిషినల్‌ లేబర్‌ కమిషనర్‌ ఎంఎన్‌ వరహాలరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-24T05:21:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising