ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

ABN, First Publish Date - 2021-02-27T05:58:26+05:30

సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికల అధికారులకు సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య సూచించారు.

ఎన్నికల విధులపై సిబ్బందికి వివరిస్తున్న సబ్‌ కలెక్టర్‌ మౌర్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  ఎన్నికల అధికారుల శిక్షణలో సబ్‌ కలెక్టర్‌  మౌర్య 


నర్సీపట్నం, ఫిబ్రవరి 26 : సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికల అధికారులకు సబ్‌ కలెక్టర్‌ నారపరెడ్డి మౌర్య సూచించారు. వెబ్‌కాస్టింగ్‌ పెట్టి, ర్యాలీలను వీడియోలు తీయించాలన్నారు. శుక్రవారం ఇక్కడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జోనల్‌, రూట్‌, ఎలక్షన్‌ ఆఫీసర్లు, పీవోలు, ఏపీవోలకు ఏర్పాటైన శిక్షణ శిబిరంలో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అంతా కృషి చేయాలన్నారు. ఫిర్యాదులు అందితే ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తక్షణమే స్పం దించాలన్నారు. ఉదయం ఎనిమిది నుంచి రాత్రి 10గంటల వరకు మాత్రమే లౌడ్‌ స్పీకర్లు వినియోగిం చేందుకు అనుమతి ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయి, ఫలితాలు వెల్లడయ్యే వరకు కోడ్‌ అమలులో ఉంటుందని వివరించారు. మద్యం, డబ్బు పంపిణీ జరగకుండా నిఘా ఉంచాలన్నారు. అనంతరం పలు వురు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ముని సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.కనకారావు, సీఐ స్వామినాయుడు, సెబ్‌ సీఐ సంతోష్‌, తహసీల్దార్‌ జయలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:58:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising