ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగురాళ్ల క్వారీలపై ప్రత్యేక నిఘా

ABN, First Publish Date - 2021-04-13T05:35:53+05:30

చింతపల్లి, జీకేవీధి మండలాల్లో రంగురాళ్ల క్వారీలపై ప్రత్యేక నిఘా పెట్టామని, మైదాన ప్రాంత వ్యాపారులు, కూలీలు క్వారీల్లో తవ్వకాలు నిర్వహించేందుకు యత్నిస్తే కేసులు నమోదు చేస్తామని అటవీశాఖ రేంజ్‌ అధికారి పీవీ రవివర్మ తెలిపారు.

సిగినాపల్లి కొండపై రంగురాళ్ల క్వారీని పరిశీలిస్తున్న అధికారులు, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అటవీశాఖ రేంజ్‌ అధికారి పీవీ రవివర్మ


చింతపల్లి, ఏప్రిల్‌ 12: చింతపల్లి, జీకేవీధి మండలాల్లో రంగురాళ్ల క్వారీలపై ప్రత్యేక నిఘా పెట్టామని,  మైదాన ప్రాంత వ్యాపారులు, కూలీలు క్వారీల్లో తవ్వకాలు నిర్వహించేందుకు యత్నిస్తే కేసులు నమోదు చేస్తామని  అటవీశాఖ రేంజ్‌ అధికారి పీవీ రవివర్మ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సిగినాపల్లి, గుర్రాళ్లగొంది, సత్యవరంలో రంగురాళ్ల క్వారీలు ఉన్నాయని, కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో రంగురాళ్ల వ్యాపారులు తవ్వకాలు నిర్వహించేందుకు యత్నిస్తుంటారని చెప్పారు. దీంతో అటవీ శాఖ ఉద్యోగులను అప్రమత్తం చేశామని, 24 గంటలూ గస్తీ నిర్వహిస్తున్నారన్నారు. సిగినాపల్లి, గుర్రాళ్లగొంది, సత్యవరం క్వారీలను స్వయంగా పరిశీలించానని, రంగురాళ్ల తవ్వకాలకు అనువుగా చిన్న చిన్న రంధ్రాలు కనిపించడంతో వాటిని గాజుపెంకులు, బండరాళ్లు, కాంక్రీట్‌తో మూసివేశామన్నారు. వ్యాపారులు రంగురాళ్ల క్వారీల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే అటవీ శాఖ ఉద్యోగులకు సమాచారం ఇచ్చేవిధంగా పరిసర గ్రామాల గిరిజనులతో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఆయన వెంట ఎఫ్‌ఎస్‌వో నూకరాజు, ఎఫ్‌బీవో భూషణం, ఏవీవో గోవిందరాజు వున్నారు.


Updated Date - 2021-04-13T05:35:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising