ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏజెన్సీలో కొవిడ్‌ టీకాలకు ప్రత్యేక డ్రైవ్‌

ABN, First Publish Date - 2021-07-27T05:52:51+05:30

ఏజెన్సీలో పది వేల మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ లక్ష్యంతో ప్రత్యేక డ్రైవ్‌ ఏర్పాటు చేశామని పాడేరు సబ్‌ కలెక్టర్‌ వి. అభిషేక్‌ అన్నారు. సోమవారం మండలంలో పర్యటించిన ఆయన అంతర్ల ఉపకేంద్రం వద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు.

రెవెన్యూ సిబ్బందితో మాట్లాడుతున్న పాడేరు సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



పది వేల మందికి లక్ష్యం : సబ్‌కలెక్టర్‌ అభిషేక్‌

చింతపల్లి, జూలై 26: ఏజెన్సీలో పది వేల మందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ లక్ష్యంతో ప్రత్యేక డ్రైవ్‌ ఏర్పాటు చేశామని పాడేరు సబ్‌ కలెక్టర్‌ వి. అభిషేక్‌ అన్నారు. సోమవారం మండలంలో పర్యటించిన ఆయన అంతర్ల ఉపకేంద్రం వద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. అలాగే స్థానిక రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన గిరిజనులు నిరీక్షిస్తుండడాన్ని పరిశీలించిన సబ్‌కలెక్టర్‌ ప్రజలు కూర్చోనేందుకు బెంచీలను ఏర్పాటు చేయాలని డీటీ తిరుమలబాబుని ఆదేశించారు. ఈసందర్భంగా సబ్‌ కలెక్టర్‌ విలేకర్లతో మాట్లాడుతూ, రెవెన్యూ సేవలు సకాలంలో ప్రజలకు అందించాలని తహసీల్దార్లకు సూచనలు ఇచ్చామన్నారు. ప్రభుత్వం నుంచి అందించేపత్రాలు నిర్ణీత సమయంలో అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు పీహెచ్‌సీలు, ఉప కేంద్రాల్లో వైద్యసిబ్బంది వ్యాక్సినేషన్‌ చేస్తున్నారన్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు.  

Updated Date - 2021-07-27T05:52:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising