ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనధికార ఇళ్లు క్రమబద్ధీకరించుకోండి

ABN, First Publish Date - 2021-10-22T06:33:05+05:30

ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా నిర్మించుకున్న ఇళ్లను నెలాఖరులోగా క్రమబద్ధీకరించుకోవాలని ఆర్డీవో జె.సీతారామారావు తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో సీతారామారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్డీవో సీతారామారావు


తుమ్మపాల, అక్టోబరు 21: ప్రభుత్వ స్థలాల్లో అనుమతులు లేకుండా నిర్మించుకున్న ఇళ్లను  నెలాఖరులోగా క్రమబద్ధీకరించుకోవాలని ఆర్డీవో జె.సీతారామారావు తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 225 జీవో ప్రకారం పోరంబోకు, కొండపోరంబోకు, గయాలు భూముల్లో 75 నుంచి 300 గజాలలోపు ఆక్రమించి కట్టుకున్న ఇళ్లను భూమి విలువను చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చన్నారు. అంతకు పైబడి ఆక్రమణలో ఉన్న వారిని గుర్తించి తొలగిస్తామని ఆయన తెలిపారు. 2019 అక్టోబరు 15వ తేదీ నాటికి ఇంటి పన్ను రశీదు, కరెంటుబిల్లు తదితర పత్రాలు తప్పక ఉండాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసరావు, డీటీ వెంకటరమణ, ఆర్‌ఐలు ఈశ్వరరావు, ముంతాజ్‌బేగం పాల్గొన్నారు.


Updated Date - 2021-10-22T06:33:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising